మంగళవారం 31 మార్చి 2020
International - Jan 27, 2020 , 01:56:38

హెచ్‌ఐవీ చికిత్సలో కీలక ముందడుగు

హెచ్‌ఐవీ చికిత్సలో కీలక ముందడుగు
  • రక్తంలో నిద్రావస్థలో ఉన్న హెచ్‌ఐవీ వైరస్‌ను ఉనికిలోకి తేవడంలో అమెరికా శాస్త్రవేత్తలు సక్సెస్‌

వాషింగ్టన్‌: గతకొన్ని దశాబ్దాలుగా మందులకు చిక్కని మహమ్మారిగా వైద్యశాస్ర్తానికి సవాలు విసురుతున్న హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టడంలో కీలక ముందడుగు పడింది. రక్తంలో నిద్రావస్థలో ఉన్న హెచ్‌ఐవీ వైరస్‌ ఉనికిని వెలికితీయటంలో అమెరికాలోని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. శరీరంలో హెచ్‌ఐవీ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవటానికి యాంటీరెట్రోవైరల్‌ థెరపీ(ఏఆర్టీ) చికిత్సను రోగులు తీసుకుంటున్నారు. ఈ చికిత్స ద్వారా రోగి శరీరంలో వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గినప్పటికీ, రక్తంలో వైరస్‌ కారకాలు నిద్రావస్థలో ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థలోని సీడీ+టీ కణాల్లో జీవిస్తాయి. దీంతో హెచ్‌ఐవీని పూర్తి స్థాయిలో నిర్మూలించడం సాధ్యపడట్లేదు. ఏజడ్‌డీ5582 అనే సమ్మేళనంతో రక్తంలో నిద్రావస్థలో ఉన్న హెచ్‌ఐవీ కారకాల్ని సీడీ+టీ కణాలను ఉత్తేజితం చేయటం ద్వారా ఉనికిలోకి తీసుకురావటంలో నార్త్‌ కరోలినా శాస్త్రవేత్తలు సక్సెస్‌ అయ్యారు. ఎలుకల్లో జరిపిన ఈ పరిశోధన అంశాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 


logo
>>>>>>