శనివారం 30 మే 2020
International - May 02, 2020 , 16:18:48

చైనాలో కొత్త కరోనా కేసుల సంఖ్య 1

చైనాలో కొత్త కరోనా కేసుల సంఖ్య 1

హైదరాబాద్: కరోనా వైరస్ కు జన్మస్థలి అయిన చైనాలో కొత్త కోరనా కేసుల సంఖ్య 1కి పడిపోయింది. కొత్తగా ఎవరూ చనిపోకపోవడంతో మరణాల సంఖ్య 4633 వద్దే ఆగిపోయింది. శుక్రవారం నాటికి చైనా ప్రధాన భూభాగంపై నమోదైన కరోనా కేసుల సంఖ్య 82,875 కాగా అండులో 77,685 మంది కోలుకున్నారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. శుక్రవారం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాడజిటివ్ అని తేలింది. స్థానికంగా కరోనా వ్యాప్తి దాదాపుగా ఆగిపోయినట్టే. మొత్తం 1671 విదేశీ కరోనా కేసులు నమోదు కాగా అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హూబెయ్ ప్రావిన్స్ శనివారం నాడు కరోనా హెచ్చరికల స్థాయిని అత్యధిక నుంచి రెండో అత్యధిక స్థాయికి తగ్గించింది. వైరస్‌ను నియంత్రించాం అనడానికి ఈ తగ్గింపు ఓ సూచిక వంటిదని హూబెయ్ వైస్-గవర్నర్ మీడియాకు చెప్పారు. ిదిలాఉండగా ఏమాత్రం లక్షణాలు బయటపడని కరోనా కేసులు 20 వరకు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 989కి చేరుకున్నది. వీరికి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ బయటికి జ్వరం, దగ్గు వంటి లక్షణాలేవీ కనిపించవు.


logo