బుధవారం 03 మార్చి 2021
International - Feb 22, 2021 , 02:25:52

మనుషులకు కొత్తరకం బర్డ్‌ ఫ్లూ

మనుషులకు కొత్తరకం బర్డ్‌ ఫ్లూ

మాస్కో: ప్రపంచంలోనే తొలిసారిగా ‘హెచ్‌5ఎన్‌8’ అనే కొత్త రకం బర్డ్‌ ఫ్లూ వైరస్‌ మనుషులకు సోకింది. దక్షిణ రష్యాలోని ఒక పౌల్ట్రీఫావ్‌ులో పనిచేసే ఏడుగురిలో ఈ స్ట్రెయిన్‌ గుర్తించినట్టు రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ వైరస్‌ తీవ్రత తక్కువగా ఉండటం వల్ల రోగుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్య లు తలెత్తలేదని అధికారులు తెలిపారు. స్వల్ప చికిత్సతో బాధితులందరూ కోలుకున్నట్టు పేర్కొన్నారు. మనుషుల నుంచి మనుషులకు ‘హెచ్‌5ఎన్‌8’ సోకడంలేదని స్పష్టం చేశారు. ఈ వివరాల్ని డబ్ల్యూహెచ్‌ వోకు కూడా తెలియజేశామన్నారు.

VIDEOS

logo