శనివారం 16 జనవరి 2021
International - Nov 29, 2020 , 00:44:46

ఏకకణ వైరస్‌లను గుర్తించే కొత్త విధానం

ఏకకణ వైరస్‌లను గుర్తించే కొత్త విధానం

టోక్యో: ఏకకణ వైరస్‌లను గుర్తించే కొత్త విధానాన్ని జపాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సిలికాన్‌ నానో రంధ్రాల్లో ప్రవహించే విద్యుత్‌లో కలిగే మార్పుల ఆధారంగా వీటిని గుర్తించనున్నారు. నానో రంధ్రాల్లోకి వైరస్‌ పార్టికల్‌ ప్రవేశించినప్పుడు అది అయాన్ల ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. దీంతో కరెంట్‌లో స్వల్ప తేడా సంభవిస్తుంది. దీని ఆధారంగా వైరస్‌ను గుర్తించనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. మెరుగైన కొవిడ్‌ టెస్ట్‌ కిట్ల తయారీకి ఈ పరిశోధన దోహదపడనుంది.