గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 10, 2020 , 14:44:37

నెటిజన్ల మనసు గెలుచుకున్న కమలాహ్యారిస్‌. ఎందుకో తెలుసా..?

నెటిజన్ల మనసు గెలుచుకున్న కమలాహ్యారిస్‌. ఎందుకో తెలుసా..?

వాషింగ్టన్‌: అమెరికా అధక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈ పదవికి పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళ, ఆసియా అమెరికన్ ఆమెనే కావడం విశేషం. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో వలసదారులకు కమల జన్మించారు. ఆమె తల్లి భారత్‌లో, తండ్రి జమైకాలో జన్మించారు. తాను ఉపాధ్యక్ష పదవికి నామినేట్‌ అయిన వెంటనే ఆమె తన తల్లికి ఇడ్లీ అంటే ఇష్టమని చెప్పి భారీతీయుల మనసులను గెలుచుకున్నారు. ప్రస్తుతం తన వేషధారణతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆమె ధరించిన బట్టలు, స్నీకర్స్‌ (షూస్‌) ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని అందరూ కమెంట్‌ చేస్తున్నారు. 

55 ఏళ్ల కమలాహ్యారిస్‌ బ్లాక్ టాప్, బ్లూ బ్లేజర్‌తోపాటు స్నీకర్లను ధరించి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె ధరించిన స్నీకర్స్‌ ‘చక్ టేలర్‌’ సాంప్రదాయ బూట్లు. వీటికి అమెరికాలో గత ఆరు నుంచి ఏడు దశాబ్దాల కాలంలో అక్కడ గౌరవనీయస్థానం ఉంది.  ఆమె చిత్రాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. హ్యారిస్‌ స్టైల్ కంటే సౌకర్యం కోసం ప్రాధాన్యత ఇవ్వడం తమకు నచ్చిందని నెటిజన్లు అంటున్నారు. ఇతర రాజకీయ నాయకురాళ్లలాగా హైహీల్స్‌ కాకుండా స్నీకర్స్‌ ధరించడం నెటిజన్లతోపాటు ఫ్యాషన్‌ విమర్శకులనూ ఆకట్టుకుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo