మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 22, 2020 , 14:54:59

వ్యర్థాలతో ఎలక్ట్రిక్ కారును తయారుచేసిన విద్యార్థులు...

వ్యర్థాలతో ఎలక్ట్రిక్ కారును తయారుచేసిన విద్యార్థులు...

ఢిల్లీ: పర్యావరణానికి హాని జరగకుండా ఉండేందుకు ప్రపంచదేశాలు ప్రకృతికి మేలు చేసే  ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నాయి. అందులోభాగంగానే ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్లు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి హాని కలిగించవు. అంతే కాకుండా పెట్రోల్ ,డీజిల్ కార్లతో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చుకూడా  చాలా తక్కువ.  దీంతో ప్రజలు ఎలక్ట్రిక్ కార్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముడి చమురు దిగుమతుల పరిమాణాన్నితగ్గించడానికి ,పర్యావరణానికి హాని కలిగించని ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. 

నెదర్లాండ్స్‌కు చెందిన 22 మంది విద్యార్థుల బృందం వ్యర్థాలతో ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ కారును 18 నెలలపాటు శ్రమించి తయారు చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బాడీని హార్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. పాత సామాగ్రి తోపాటు   టీవీ, బొమ్మలు , గృహోపకరణాలను ఈ కారు తయారీలో ఉపయోగించారు.b ఈ ఎలక్ట్రిక్ కారులోని రెండు సీట్లు కొబ్బరి ఫైబర్ , గుర్రపు వెంట్రుకలతో తయారు చేశారు.   దీనికి ఎల్లో కలర్ వేశారు. ఈ ఎలక్ట్రిక్ కారుకు "లూకా" అని నామకరణం చేశారు.

ఈ కారు గంటకు 90 కిమీ (56కెఎంపీహెచ్) వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత దాదాపు ఈ కారు 220 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఐండ్‌హోవెన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ఈ కారుపై నివేదికలను అందించింది. ఈ లూకా కారును తయారు చేసిన బృందంలోని సభ్యుడు మాట్లాడుతూ కార్ల తయారీదారులు వ్యర్థ ఉత్పత్తులను కూడా కార్ల ఉత్పత్తికి ఉపయోగించవచ్చని, ఈ ఎలక్ట్రిక్ కారును వ్యర్థ ఉత్పత్తుల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడానికి ఈ వినూత్నమైన కారును తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.