మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 12, 2020 , 16:26:55

నేపాల్ టూరిజం శాఖ మంత్రికి కరోనా పాజిటివ్...

నేపాల్ టూరిజం శాఖ మంత్రికి కరోనా పాజిటివ్...

నేపాల్‌: నేపాల్ టూరిజం శాఖ మంత్రి యోగేశ్ భట్టారాయ్ కరోనా బారీన పడ్డారు.  నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి అత్యంత సన్నిహితుడిగా యోగేశ్ భట్టారాయ్  గుర్తింపు పొందారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అటు, ప్రధాని కేపీ శర్మ ఓలి సన్నిహితుల్లో చాలామంది కరోనా బారినపడ్డారు. వారిలో ఆయన డాక్టర్ కూడా ఉన్నారు. మీడియా వ్యవహారాల నిపుణుడు, ఫొటోగ్రాఫర్ కూడా వీరిలో ఉన్నారు. దాంతో ప్రధాని కోసం అత్యంత కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo