శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 25, 2021 , 01:57:09

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ నుంచి ఆపద్ధర్మ ప్రధాని ఓలీ బహిష్కరణ

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ నుంచి ఆపద్ధర్మ ప్రధాని ఓలీ బహిష్కరణ

కాఠ్మండు, జనవరి 24: నేపాల్‌ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలీని అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ) నుంచి ఆ పార్టీ చీలిక వర్గం బహిష్కరించింది. పార్టీలో ఓలీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఈ మేరకు ప్రచండ నాయకత్వంలోని చీలిక వర్గానికి చెందిన కేంద్ర కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 20న నేపాల్‌ పార్లమెంటును ఓలీ రద్దు చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అదే నెలలో ఓలీని ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి ప్రచండ వర్గం తొలగించింది. 


VIDEOS

logo