సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 31, 2020 , 20:43:11

నేపాల్ గొప్ప స్నేహితుడ్ని కోల్పోయింది: ప్రధాని కేపీ శర్మ ఓలి

నేపాల్ గొప్ప స్నేహితుడ్ని కోల్పోయింది: ప్రధాని కేపీ శర్మ ఓలి

కాఠ్మండూ: నేపాల్ గొప్ప స్నేహితుడ్ని కోల్పోయిందని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణంపట్ల ఆయన సంతాపం తెలిపారు. భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుచేసుకుంటామని చెప్పారు. ఆయన మరణవార్త తనను బాధకు గురిచేసిందని కేపీ శర్మ ఓలి అన్నారు. భారత ప్రభుత్వం, భారతీయులు, ప్రణబ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతునట్లు ట్వీట్ చేశారు.మరో పొరుగుదేశమైన భూటాన్ కూడా ప్రణబ్ మరణంపట్ల సంతాపం తెలిపింది. భూటాన్ ప్రజల తరుఫున తాను సంతాపం తెలియజేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని లొటే షెరింగ్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు శక్తిని కూడగట్టుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo