మంగళవారం 31 మార్చి 2020
International - Jan 23, 2020 , 01:39:32

పర్యాటకుల మృతిపై నేపాల్‌ విచారణ

పర్యాటకుల మృతిపై  నేపాల్‌ విచారణ
  • నేడు స్వస్థలానికి కేరళవాసుల మృతదేహాలు

కఠ్మాండు: తమ దేశానికి విహారయాత్రకు వచ్చిన ఎనిమిది మంది భారతీయుల అనూహ్య మృతిపై  విచారణకు నేపాల్‌ ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. నలుగురు బాలలు సహా ఎనిమిది మంది పర్యాటకుల మృతిపై 15రోజుల్లో  దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించింది. కేరళ నుం చి 15 మంది నేపాల్‌ పర్యటనకు వెళ్లగా వారి లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మక్వాన్‌పూర్‌ జిల్లాలోని ఓ హోటల్లో బసచేసిన వారిలో ఎనిమిది మంది అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. వారి మృతికి గదిలోని హీటర్‌ నుంచి గ్యాస్‌ లీకవడమే కారణమని పోలీసులు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను హోటల్‌ యాజమా న్యం పాటిస్తున్నదా లేదా అంశంపై విచారణ బృందం దర్యాప్తు చేస్తుందని పోలీసులు చెప్పారు. మృతుల పోస్ట్‌మార్టం ఇంకా కొనసాగుతున్నదని, మృతదేహాలను గురువారం వారి స్వస్థలానికి పంపుతామని తెలిపారు. మరోవైపు, మృతదేహాల తరలింపునకయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.


విషాదంగా మారిన  బర్త్‌డే ట్రిప్‌

తిరువనంతపురం: నేపాల్‌లో మరణించిన నలుగురు బాలల్లో ముగ్గురు ఈ నెలలోనే తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. మంచు పర్వతాల్లో ఆహ్లాదకర వాతావరణం మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆ పసి హృదయాలు భావించాయి. అంతలో నే వారి జీవితాలు అర్ధంతరంగా ముగిశాయి. ఆ ముగ్గురు పిల్లలతోపాటు వారి తల్లిదండ్రు లూ ప్రాణాలొదిలారు. దుబాయ్‌లో ఐటీ నిపుణుడు ప్రవీణ్‌నాయర్‌ దంపతులు, వారి ముగ్గురు పిల్లలు శ్రీభద్ర (9), ఆర్చా (7), అభినవ్‌ (4) మరో పది మందితో కలిసి నేపా ల్‌కొచ్చారు. పిల్లలు ముగ్గురు తమ మిత్రులు, టీచర్లతో తాము నేపాల్‌లో తమ బర్త్‌డే జరుపుకొనేందుకు వెళ్తున్నట్టు చెప్పారు.వారి మరణ వార్తను నమ్మలేకపోతున్నామని, కొచ్చిలోని స్కూల్‌ టీచర్లు భావోద్వేగానికి గురయ్యారు. 


logo
>>>>>>