శనివారం 30 మే 2020
International - Mar 29, 2020 , 21:55:26

నేపాల్‌లో ఏప్రిల్ 7 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు

నేపాల్‌లో ఏప్రిల్ 7 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు

న్యూఢిల్లీ: క‌రోనా మహ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ఇప్ప‌టికే అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్‌ను నేపాల్ ప్ర‌భుత్వం ఏప్రిల్ 7 వ‌ర‌కు పొడిగించింది. ఆదివారం జ‌రిగిన నేపాల్ క్యాబినెట్ మీటింగ్‌లో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా, నేపాల్ ఇప్ప‌టికే మార్చి 22 నుంచి 31 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. అయితే క‌రోనా మ‌హ‌మ‌మ్మారి చాప‌కింద నీరులా పాకుతూ ఇప్ప‌టివ‌ర‌కు 5 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో లాక్‌డౌన్ వ్య‌వ‌ధిని మ‌రో వారం రోజులు పొడిగిస్తూ నేపాల్ స‌ర్కారు నిర్ణ‌యం చేసింది.

అదేవిధంగా అంత‌ర్జాతీయ విమానాల‌పై రాక‌పోక‌ల‌పై విధించిన నిషేధాన్ని కూడా నేపాల్ ప్ర‌భుత్వం ఏప్రిల్ 15 వ‌ర‌కు పొడిగించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్లైట్స్‌పై ఇప్ప‌టికే మార్చి 31 వ‌ర‌కు నిషేధం అమ‌ల్లో ఉండ‌గా.. ఈ నిషేధాన్ని మ‌రో రెండు వారాలు పొడిగిస్తున్న‌ట్లు నేపాల్ స‌ర్కారు వెల్ల‌డించింది. కాగా, నేపాల్ లో న‌మోదైన 5 క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఇప్ప‌టికే ఒక‌రు పూర్తిగా కోలుకోగా.. మ‌రో నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి.   


logo