గురువారం 04 జూన్ 2020
International - May 08, 2020 , 19:51:36

నేపాల్‌లో మ‌రో మూడు కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు

నేపాల్‌లో మ‌రో మూడు కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు

ఖాట్మండు:  నేపాల్‌లో మ‌రో ముడు కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 102కు చేరుకుంద‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి ర‌చ‌న శిరీష్ ప్ర‌ధాన్ తెలిపారు. క‌రోనావైర‌స్ ఇన్పెక్ష‌న్లు త‌క్క‌వ‌గా ఉన్న దేశాల‌లో నేపాల్ ఒక‌టి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో క‌పిల‌వ‌స్తుకు చెందిన ఇద్ద‌రు, నేపాల్ గంజ్‌కు చెందిన ఒక‌రికి కోవిడ్ -19 ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. ఒక భార‌తీయుడితో స‌హా నేపాల్‌కు చెందిన 8 మంది క‌రోనా బాధితులు చికిత్స అనంత‌రం కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 30 మంది క‌రోనా బాధితులు చికిత్స అనంత‌రం కోలుకున్న‌ట్లు తెలిపారు. క‌రోనా కార‌ణంగా ఈ దేశంలో ఎవ‌రూ మృతి చెంద‌లేదు.  


logo