ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 10, 2020 , 16:45:54

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం వాయిదా

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం వాయిదా

ఖాట్మండు : నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాన్ని మరో వారంరోజులపాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్‌ కాజీ శ్రేష్ఠ శుక్రవారం తెలిపారు. పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశాన్ని జులై 10 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని కేపీ శర్మ ఓలి మీడియా సలహాదారు సూర్యతాప గత బుధవారానికి ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రధాని కేపీ ఓలి, పుష్పకమల్‌ ధాల్‌ ప్రచండ తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో పార్టీ చీలిక అంచుకు చేరింది. ప్రచండ వర్గానికి చెందిన సీనియర్‌ నాయకులు మాధవ్‌ నేపాల్‌, జల్‌నాథ్‌ ఖన్నల్‌ తదితరులు ఓలి ప్రధాని పదవితోపాటు నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సీపీ) చైర్మన్‌ పదివికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. భారత్‌ తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నిస్తుందని ఓలి బహిరంగ ప్రకటన చేసిన నాటి నుంచి ప్రభుత్వాన్నినడపడంలో ఆయన విఫలయ్యారని పార్టీ నుంచి బయట నుంచి విమర్శులు వెల్లువెత్తున్నాయి.logo