సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 15:54:36

నేపాల్‌ మంత్రిత్వశాఖ భవనాల్లో బాంబులు

నేపాల్‌ మంత్రిత్వశాఖ భవనాల్లో బాంబులు

ఖాట్మండు :  నేపాల్‌లోని సుదూర్‌పాశ్చిమ్‌ ప్రాంతంలోని మూడు మంత్రిత్వశాఖ భవనాలు, ప్రాంతీయ అసెంబ్లీ భవనం వద్ద ఆ దేశ సైనిక విభాగ బాంబుస్క్వాడ్‌ బృందం మంగళవారం బాంబులను నిర్వీర్యం చేసింది. ఆర్థిక, ప్రణాళిక మంత్రిత్వశాఖ, మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రిత్వశాఖ, సాంఘిక సంక్షేమ మంత్రిత్వశాఖ భవనాల ఎదుట సిబ్బంది అనుమానాస్పద వస్తువులను గుర్తించారు.

అప్రమత్తమై బాంబుస్క్వాడ్‌ బృందానికి సమాచారం ఇవ్వడంతో కుక్కర్ బాంబులు ఉన్నట్లు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారని కైలాలి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) ప్రతీక్ బిస్టా చెప్పారు. బాంబుల కలకలం  నేపథ్యంలో ఈ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు. నిషేధిత నేత బిక్రామ్ చంద్ బిప్లావ్ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుదారులపై భద్రతా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


logo