బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 13:05:14

యూఎస్‌లో కోవిడ్‌-19 బారిన 5,50,000 మంది చిన్నారులు

యూఎస్‌లో కోవిడ్‌-19 బారిన 5,50,000 మంది చిన్నారులు

వాషింగ్ట‌న్ : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన‌నాటి నుంచి నేటి వ‌ర‌కు అమెరికాలో 5,50,000 మంది చిన్నారులు కోవిడ్‌-19 బారిన ప‌డ్డారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్‌ చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ వెల్ల‌డించిన నివేదిక ఈ విష‌యాన్ని బ‌హిర్గ‌త ప‌రిచింది. ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు 72,993 మంది చిన్నారులు ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు. పిల్ల‌ల్లో క‌రోనా కేసుల సంఖ్య రెండు వారాల్లోనే 15 శాతం పెరిగింది. ప్ర‌తీ వెయ్యి మందిలో 729 మంది చిన్నారులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. కోవిడ్‌కు గురైన చిన్నారుల్లో 0.6 నుంచి 3.6 శాతం మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు నివేదిక వెల్ల‌డించింది.


logo