శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 17:30:57

అమెరికాలో 200 మంది నేషనల్‌ గార్డ్స్‌కు కరోనా

అమెరికాలో 200 మంది నేషనల్‌ గార్డ్స్‌కు కరోనా

వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భద్రత కల్పించడానికి వచ్చిన నేషనల్‌ గార్డ్స్‌కు కరోనా వైరస్‌ సోకింది. దాదాపు 100 నుంచి 200 మందికి కొవిడ్-19 కు పాజిటివ్‌గా తేలారు. జనవరి 6 న క్యాపిటల్ హిల్‌పై దాడి చేసినప్పటి నుంచి 25 వేల మందికి పైగా సైనికులు వాషింగ్టన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా విధుల్లో ఉన్నారు. వీరికి కరోనా వైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు జరిపారు. పాజిటివ్‌గా తేలిన సిబ్బంది సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్‌ భవంతిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం వాషింగ్టన్‌ నగరంలో అద్వితీయమైన భద్రతా చర్యలను తీసుకున్నది. అన్ని చెక్‌పోస్టుల వద్ద నేషనల్ గార్డ్స్‌ విధుల్లో ఉంచారు. గత 17 రోజులుగా భద్రతా డ్యూటీలో ఉన్న నేషనల్ గార్డ్స్‌ పలువురు అస్వస్థతకు గురయినట్లు అధికారులు గుర్తించారు. దాంతో విధుల్లో ఉన్న నేషనల్‌ గార్డ్స్‌ అందరినీ కరోనా వైరస్‌ పరీక్షలు జరిపారు. సిబ్బంది తమ సొంత రాష్ట్రం నుంచి బయలుదేరి వాషింగ్టన్‌ వచ్చినప్పుడు జ్వరం తనిఖీలతో పాటు వ్యాధి నియంత్రణ, నివారణ మార్గదర్శకాలను అనుసరిస్తున్నారు.

6,00,000 మంది మరణిస్తారు: బైడెన్‌

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచంలోనే అత్యంత నష్టపోయిన దేశమైన అమెరికాలో కొవిడ్-19 మరణాల సంఖ్య 6,00,000 కు చేరుకుంటుందని అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం అన్నారు. "వైరస్ పెరుగుతున్నది. ఇప్పటికే 4,00,000 మంది చనిపోయారు. భవిష్యత్‌ ఈ సంఖ్య 6,00,000 కు చేరుకొనే అవకాశాలు ఉన్నాయి" అని చెప్పారు. "చాలా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి.. ఉద్యోగ నష్టాలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది" అని బిడెన్ అన్నారు. మిలియన్ల మంది అమెరికన్లను ప్రభావితం చేసే ఆహార సంక్షోభాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసే ముందు బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి..

బర్డ్‌ ఫ్లూతో భయాందోళనలు వద్దు

24న భారత్‌-చైనా తొమ్మిదో రౌండ్‌ చర్చలు

ల్యాండ్‌ మాఫియాపై చర్యలు తీసుకోండి: మెహబూబా ముఫ్తీ

ఇది అత్యత్తమ పోలీస్‌ శిక్షణ కళాశాల

మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo