శనివారం 30 మే 2020
International - Apr 22, 2020 , 06:50:01

కరోనా ఎఫెక్ట్.. 2.5 కోట్ల ఉద్యోగాలు ఊస్ట్‌

కరోనా ఎఫెక్ట్.. 2.5 కోట్ల ఉద్యోగాలు ఊస్ట్‌

జెనీవా: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలను కోల్పోయే అవకాశమున్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) తెలిపింది. అయితే అంతర్జాతీయ సమన్వయం, సహకారంతో ఈ సమస్య ప్రభావాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ‘కొవిడ్‌-19 అండ్‌ వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌: ప్రభావం, బాధ్యతలు’ అనే పేరుతో మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా వల్ల ప్రభావితమయ్యే అంతర్జాతీయ జీడీపీ వృద్ధి వంటి పలు అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుదల గరిష్ఠంగా 2.47 కోట్లు, కనిష్ఠంగా 53 లక్షలు ఉండవచ్చని అంచనా వేసింది. కరోనా నేపథ్యంలో పని గంటలు, వేతనాల్లో తగ్గుదల వల్ల ప్రస్తుత ఉద్యోగాలు కూడా భారీగా కోల్పోవచ్చని చెప్పింది. ఈ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల నుంచి 3.5 కోట్ల వరకు ఉద్యోగులు పేదరికంలో కూరుకు పోవచ్చని అంచనా వేసింది. 


logo