శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 15, 2020 , 02:26:54

లండన్‌ రెస్టారెంట్‌లో నవాజ్‌ షరీఫ్‌!

లండన్‌ రెస్టారెంట్‌లో నవాజ్‌ షరీఫ్‌!
  • ఆయన అనారోగ్యంపై పాక్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి వ్యంగ్యాస్త్రం
  • వైద్య చికిత్స కోసం నవంబర్‌లో లండన్‌కు వెళ్లిన పాక్‌ మాజీ ప్రధాని

ఇస్లామాబాద్‌: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం బ్రిటన్‌కు వెళ్లిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ (69), కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌లో రెస్టారెంట్‌లో ప్రత్యక్షమైన ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది. అవినీతి కేసులో ఏడేండ్ల జైలుశిక్ష పడి చెరసాల పాలైన నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్య చికిత్స కోసం బెయిల్‌పై గతేడాది నవంబర్‌ 19న లండన్‌కు వెళ్లారు. సోమవారం లీకైన నవాజ్‌ షరీఫ్‌ ఫొటోను పాక్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘లూటీకి పాల్పడిన వారికి లండన్‌లో ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నది. (అక్కడ) ఉన్న రోగుల ఆరోగ్యం కుదుటపడినట్లు ఉంది’ అని ఎద్దేవా చేశారు. 


logo