శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 02, 2020 , 11:45:00

అమెరికా డాక్టర్‌ ఆంథోని ఫౌసీ వ్యక్తిగత భద్రతకు ముప్పు

అమెరికా డాక్టర్‌ ఆంథోని ఫౌసీ వ్యక్తిగత భద్రతకు ముప్పు

హైదరాబాద్‌ : అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు 5,110 మంది మృతి చెందారు. 2,15,300 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే అమెరికాలో లాక్‌డౌన్‌ విధించకుండా, స్వీయ నియంత్రణ పాటించకపోతే కరోనా మరణాల సంఖ్య సుమారు లక్ష నుంచి 2 లక్షల 40 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని అమెరికా డాక్టర్‌ ఆంథోని ఫౌసీ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫౌసీ చెప్పడంతో.. రానున్న రెండు వారాల్లో వైరస్‌ వల్ల చనిపోయే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుందని చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కొవాలంటే తప్పనిసరిగా లాక్‌డౌన్‌ విధించాలని అమెరికా డాక్టర్లు ట్రంప్‌కు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ విధించాలని ఫౌసీ గట్టిగా నొక్కి చెప్పడంతో అమెరికన్లకు నచ్చడం లేదు. లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారాలకు నష్టం సంభవించే అవకాశం ఉందంటూ బిజినెస్‌మెన్లతో పాటు ఇతరులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఫౌసీకి బెదిరింపులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఫౌసీ హెల్త్‌ అండ్‌ హ్యుమన్‌ సర్వీసెస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయనకు భద్రత పెంచారు. ఫౌసీ ఇంటితో పాటు ఆయన వెళ్లే ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. 


logo