హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికైన పొన్నం అశోక్గౌడ్ను పలువురు గౌడసంఘాల నేతలు శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో అఖిలభారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు పేరం శివ నాగేశ్వరరావుగౌడ్, గౌడ సంఘాల జేఏసీ కో చైర్మన్, అభిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్యగౌడ్, తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు నాసగోని రాజయ్యగౌడ్, రిటైర్డ్ న్యాయమూర్తి బత్తిన వెంకటప్రసాద్గౌడ్ తదితరులు ఉన్నారు.