ఆదివారం 24 జనవరి 2021
International - Dec 04, 2020 , 11:33:21

ఒక డాల‌ర్‌కే చంద్రుడి మ‌ట్టి..

ఒక డాల‌ర్‌కే చంద్రుడి మ‌ట్టి..

హైద‌రాబాద్‌: చంద్రుడి మీద‌కు వెళ్ల‌డం ఎంత ఖ‌ర్చు అవుతంది ?  మ‌రి అక్క‌డ మ‌ట్టి తేవాలంటే ఇంకెంత ఖ‌ర్చు అవుతుంది ? కానీ అమెరికాకు చెందిన నాసా ఆ లెక్క‌లు ఏమీ చూడ‌డం లేదు.  ఒక డాల‌ర్‌కు అమెరికాలో కాఫీ కూడా రాదు. కానీ చంద్రుడి మీద మ‌ట్టి తెచ్చే ఓ కంపెనీకి మాత్రం నాసా కేవ‌లం ఒక్క డాల‌ర్‌కే ఆ మ‌ట్టిని కొనుగోలు చేయ‌నున్న‌ది.  కొల‌రాడోకు చెందిన స్టార్ట్ అప్ లూనార్ ఔట్‌పోస్ట్ వ‌ద్ద చంద్రుడి మ‌ట్టిని నాసా ఖ‌రీదు చేయ‌నున్న‌ది.  అయితే 50 గ్రాముల నుంచి 500 గ్రాముల వ‌ర‌కు ఆ కంపెనీ నుంచి నాసా కొన‌నున్న‌ది. దాని కోసం కేవ‌లం ఒకే ఒక్క డాల‌ర్ చెల్లించేందుకు నాసా ఒప్పందం కుదుర్చుకున్న‌ది.  చంద్రుడి నుంచి తీసుకువ‌చ్చే శ్యాంపిళ్ల కాంట్రాక్టును లూనార్ ఔట్‌పోస్ట్‌కు నాసా అప్ప‌గించింది. బిడ్డింగ్ గెలిచిన కంపెనీల్లో కాలిఫోర్నియాకు చెందిన మాస్టెన్ స్పేస్ సిస్ట‌మ్స్‌, టోక్యోకు చెందిన ఐస్పేస్‌ల‌తో పాటు యురోపియ‌న్ కంపెనీ కూడా ఉన్న‌ది.  చంద్రుడిపై ఉన్న మ‌ట్టిని తెచ్చేందుకు ఈ కంపెనీల‌కు నాసా డ‌బ్బులు చెల్లించ‌నున్నారు. చంద్రుడి నుంచి మ‌ట్టి తెచ్చే మిషన్‌ను 2023లో చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.   


logo