ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 19:22:26

విజయవంతంగా నింగికెగిసిన నాసా మార్స్‌ రోవర్‌

విజయవంతంగా నింగికెగిసిన నాసా మార్స్‌ రోవర్‌

వాషింగ్టన్‌ డీసీ: అంగారకుడిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఐదో రోవర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనెర్వాల్‌ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద లాంచ్ కాంప్లెక్స్ 41 నుంచి అట్లాస్ వీ-541 రాకెట్ ద్వారా ‘మార్స్ 2020’ అంతరిక్ష నౌకను గురువారం ప్రయోగించింది. అరుణ గ్రహంపై జీవజాల ఉనికిని కనుగొనేందుకు సానా చేపట్టిన మార్స్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ప్రోగ్రాం (ఎంఈపీ)కు ‘పర్‌సీవెరెన్స్‌’గా పిలుస్తున్న ఈ రోవర్‌ ఎంతో దోహదం చేయనుంది. అలాగే, తమ నాలుగు దీర్ఘకాలిక లక్ష్యాలను ఈ రోవర్‌ నెరవేరుస్తుందని నాసా భావిస్తోంది. 

అంగారకుడిపై పురాతన జీవజాల ఉనికిని కనుగొనడం, అక్కడి శిలలు, నేల నమూనాలను సేకరించి భూమికి పంపడం ఈ పర్‌సీవెరెన్స్‌ రోవర్‌ లక్ష్యాలుగా నాసా పేర్కొంది. ఈ  మిషన్ వ్యవధి భూమిపై 687 రోజులు అంటే కనీసం ఒక అంగారక సంవత్సరం అని అంచనా వేస్తున్నది. ఈ రోవర్‌  ఫిబ్రవరి 18, 2021న అంగారక గ్రహంపైకి దిగుతుందని చెబుతున్నది. మార్స్‌పై భవిష్యత్తులో చేపట్టునున్న మానవయాత్రకు కావాల్సిన సమాచారాన్ని ఈ రోవర్‌ అందిస్తుందని నాసా తెలిపింది.

‌ 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo