ఆదివారం 29 మార్చి 2020
International - Mar 02, 2020 , 15:29:03

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌: చైనాలో తగ్గిన కాలుష్యం

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌: చైనాలో తగ్గిన కాలుష్యం

బీజింగ్‌:  కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వల్ల చైనాలో చాలా వరకు పరిశ్రమలు మూత పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో కాలుష్యం తీవ్రత  తగ్గినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  చైనాలో ముఖ్యంగా  హుబెయ్‌ ప్రావిన్స్‌లో వాయు కాలుష్యం బాగా తగ్గింది. గతేడాది ఫిబ్రవరి(10-25  తేదీల మధ్య) నాటికి.. ఈ ఏడాది అదే సమయానికి గాలిలో నైట్రోజన్‌ డైఆక్సైడ్‌ స్థాయిలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు తీసిన శాటిలైట్‌ చిత్రాల్లో   తేడా స్పష్టంగా కనిపిస్తోంది.  వాహనాలు, పవర్‌ ప్లాంట్లు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది.  కరోనా ప్రభావంతో చైనాలోని చాలా పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోవడం, వైరస్‌ వ్యాప్తి చెందకుండా రవాణాపై ఆంక్షలు విధించడంతో కాలుష్యంగా గణనీయంగా తగ్గింది. logo