గురువారం 28 మే 2020
International - Apr 24, 2020 , 17:23:08

37 రోజుల్లోనే వెంటిలేట‌ర్ త‌యారు చేసిన నాసా

37 రోజుల్లోనే వెంటిలేట‌ర్ త‌యారు చేసిన నాసా

హైద‌రాబాద్‌: నాసాకు చెందిన ఇంజినీర్లు కొత్త త‌ర‌హా ప్రోటోటైప్‌ వెంటిలేట‌ర్‌ను అభివృద్ధి చేశారు.  కోవిడ్‌19 రోగుల‌కు చికిత్స అందించేందుకు హై ప్రెజ‌ర్ వెంటిలేట‌ర్లు డెవ‌ల‌ప్ చేశారు. దానికి వైట‌ల్ (వెంటిలేట‌ర్ ఇంట‌ర్వెన్ష‌న్ టెక్నాల‌జీ యాక్సెస‌బుల్ లోక‌ల్లీ) అని పేరు పెట్టారు. త‌క్కువ ప‌రిక‌రాల‌తో.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే దీన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. కేవ‌లం 37 రోజుల్లో ఈ వెంటిలేట‌ర్‌ను నాసా డెవ‌ల‌ప్ చేసింది.  న్యూయార్క్‌లోని ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఆ వెంటిలేట‌ర్‌ను వినియోగించారు. స్వ‌ల్ప స్థాయిలో వైర‌స్ ల‌క్ష‌ణాల‌కు ఉన్న‌వారికి వైట‌ల్ వెంటిలేట‌ర్ మెరుగ్గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల సీరియ‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి హాస్ప‌త్రుల్లో పెద్ద వెంటిలేట‌ర్ల‌తో చికిత్స కొన‌సాగించే వీలు ఉంటుంద‌ని నాసా పేర్కొన్న‌ది. ఎఫ్‌డీఏ ఆమోదం కోసం నాసా ఎదురుచూస్తున్న‌ది. వైట‌ల్ వెంటిలేట‌ర్‌ను చాలా త్వ‌ర‌గా సులువైన రీతిలో త‌యారు చేయ‌వ‌చ్చు అని నాసా పేర్కొన్న‌ది.logo