బుధవారం 27 జనవరి 2021
International - Nov 30, 2020 , 01:48:24

నానో మెమరీ డివైజ్‌

నానో మెమరీ డివైజ్‌

  • ప్రపంచంలోనే అతిచిన్నది

హ్యూస్టన్‌: ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన మెమరీ డివైజ్‌ను అమెరికా పరిశోధకులు తయారుచేశారు. ‘ఆటమ్‌రిస్టర్‌'గా పిలుస్తున్న ఈ పరికరం సాయంతో అతి తక్కువ సైజులో ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవచ్చని తెలిపారు. కంటికి కనిపించనంత చిన్న సైజులో ఉండటం వల్ల కంప్యూటర్‌, ఫోన్‌లలో తక్కువ స్థలంలోనే ఇమిడిపోతుందని, తక్కువ విద్యుత్‌తో వేగంగా పని చేస్తుందని పేర్కొన్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. ‘ఆటమ్‌రిస్టర్‌' సైజు చదరపు నానో మీటర్‌గా (మీటరులో 100 కోట్లవ వంతు) ఉంటుందని చెప్పారు. దీని తయారీకి మోలిబ్డెనమ్‌ డీసల్ఫైడ్‌ (ఎంవోఎస్‌2) అనే సమ్మేళనాన్ని వినియోగించినట్టు పేర్కొన్నారు. ఒక చదరపు సెంటీమీటర్‌ సైజులో తయారు చేస్తే 25 టెరాబిట్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదని, ఫ్లాష్‌ మెమరీ పరికరాలతో పోలిస్తే, ఇది 100 రెట్లు ఎక్కువని వివరించారు. ఈ వివరాలు ‘నేచర్‌ నానోటెక్నాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


logo