ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 10:15:38

‘సెలూన్‌' వివాదంలో అమెరికా స్పీకర్‌ పెలోసీ

‘సెలూన్‌' వివాదంలో అమెరికా స్పీకర్‌ పెలోసీ

శాన్‌ఫ్రాన్సిస్కో : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌, డెమోక్రటిక్‌ పార్టీ ముఖ్య నాయకురాలు నాన్సీ పెలోసీ సెలూన్‌ (క్షవరశాల) వివాదంలో చిక్కుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆమె ఇటీవల తమ ఇంటి పక్కనే ఉన్న సెలూన్‌ నుంచి హెయిర్‌ స్టెలిస్ట్‌ను తన ఇంటికి పిలిపించుకుని మేకప్‌ చేయించుకున్నారు. కరోనా కారణంగా ఇలా ఇండ్లకు వెళ్లి సేవలు అందించటాన్ని నగరంలో నిషేధించినప్పటికీ సెలూన్‌ సిబ్బంది నిబంధనలు అతిక్రమించి సేవలు అందించారు.


నాన్సీ పెలోసీ ముఖానికి మాస్కులేకుండా ఒక హెయిర్‌ స్టైలిస్టును వెంటబెట్టుకొని తన ఇంటికి వెళ్తున్న వీడియోను ఫాక్స్‌న్యూస్‌ ప్రసారం చేయటంతో అమెరికాలో దుమారం రేగుతున్నది. అయితే, ఇదంతా ఎన్నికల వేళ తన ప్రతిష్ఠను దెబ్బతీయటానికి జరిగిన కుట్ర అని, సెలూన్‌ తనకు క్షమాపణ చెప్పాలని పెలోసీ డిమాండ్‌ చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ప్రత్యర్థులు మాత్రం ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

logo