శనివారం 30 మే 2020
International - May 06, 2020 , 21:20:19

ఓ అధినేత కొడుకు పేరు X Æ A-12.. దీన్ని ఎవరైనా చదువగలరా..?

ఓ అధినేత కొడుకు పేరు X Æ A-12.. దీన్ని ఎవరైనా చదువగలరా..?

X Æ A-12.. దీన్ని చూడగానే కోడింగ్‌ అనుకునేరు. ఇది ఒక పేరు. అయితే ఈ పేరుకు అర్థం ఏమిటో ఆ పేరు పెట్టిన దంపతులకు మాత్రమే తెలుసు. ఇంతకూ ఈ పేరు ఎవరు ఎవరికి పెట్టారనేగా మీ సందేహం? టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన టెస్లా కంపెనీ అధినేత ఇలాన్‌ మస్క్‌ తన కొడుక్కు పెట్టిన పేరట ఇది. ఇలాన్‌ మస్క్‌, అతని గర్ల్‌ ఫ్రెండ్‌ గ్రిమ్స్‌కు బాబు పుట్టాడు. ఈ బుడతడు ఆ దంపతుకు పుట్టిన మొదటి సంతానం. అతనికి X Æ A-12 అనే పేరుతోపాటు చివర్లో మస్క్‌ తగిలించారు. అయితే ఈ పేరును ఎలా ఉచ్చరించాలో తెలియక అభిమానులు, నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. నెటిజన్ల బాధలు చూడలేక మస్క్‌ ప్రియురాలు గ్రిమ్స్‌ ఈ పేరు గురించి వివరంగా చెప్పింది. 


logo