సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 14:20:09

బ్యాగును తీసుకెళ్లిపోతుంద‌నే ఖంగారులో వంటి మీద నూలుపోగు లేకుండానే..

బ్యాగును తీసుకెళ్లిపోతుంద‌నే ఖంగారులో వంటి మీద నూలుపోగు లేకుండానే..

సినిమాల్లో రియ‌ల్‌గా చాలాసార్లు చూసే ఉంటాం. న‌ది, చెరువుల వ‌ద్ద స్నానం చేస్తుంటే ప‌క్క‌న పెట్టుకోనున్న దుస్తుల‌ను కోతులు ప‌ట్టుకోవ‌డం. బ‌ట్ట‌లు లేకుండా ఊర్లోకి ఎలా వెళ్లాల‌ని ఏది దొరికితే దాన్ని అడ్డుపెట్టుకొని బ‌య‌ట‌ప‌డుతారు. ఈ సంఘ‌ట‌న ప‌ల్లెటూల్లోనే కాదు పెద్ద పెద్ద న‌గ‌రాల్లో కూడా జ‌రుగుతుంటాయి. అయితే ఇక్క‌డ కోతికి బ‌దులు పంది ఉంది. బ‌ట్ట‌ల‌కు బ‌దులు బ్యాగ్‌. అస‌లేం జ‌రిగిందంటే.. జర్మనీలోని గ్రీన్ వెల్ అడవిలో టీఫెల్ సీ లేక్ వద్ద టూరిస్టులు ప్ర‌తిరోజూ స్నానాలు చేస్తూ సేద తీరుతుంటారు. అక్క‌డ స‌న్‌బాత్ కోసం వంటి మీద నూలుపోగు లేకుండా ప‌డుకుంటారు.

అలా ఓ పెద్దాయ‌న సేద‌తీరుతున్న స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ను ఆహారం బ్యాగ్ అనుకొని పంది నోటికి క‌రిపించుకొని ప‌రుగులు పెట్టింది. దీంతో ఆ పెద్దాయ‌న‌ అయ్యో నా బ్యాగ్ అంటూ ప‌రుగులు పెట్టాడు. అక్క‌డ వారంతా పందిని కాకుండా అత‌న్ని చూసి హ‌డ‌లిపోయారు. ఎందుకంటే అత‌ని వంటి మీద ఎలాంటి నూలుపోగులేదు. అంద‌రేంటి న‌న్నే చూస్తున్నార‌ని అత‌నికి డౌట్ వ‌చ్చి చూసుకోగా అస‌లు విష‌యం అర్థ‌మైంది. దీంతో ఆయ‌న సిగ్గుతో చ‌చ్చిపోయాడు. ఈ సంఘ‌ట‌న‌ను అక్క‌డున్న‌వారు ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌గ తెగ వైర‌ల్ అవుతున్నాయి. 

 


logo