శనివారం 06 జూన్ 2020
International - Apr 27, 2020 , 09:30:04

నాగ‌సాకిలో క్రూయిజ్ షిప్‌.. 148 మంది సిబ్బందికి క‌రోనా

నాగ‌సాకిలో క్రూయిజ్ షిప్‌.. 148 మంది సిబ్బందికి క‌రోనా

హైద‌రాబాద్‌: జ‌పాన్‌లోని నాగ‌సాకి తీరంలో క్రూయిజ్ షిప్ నిలిచిపోయింది. ఆ నౌక‌లో ఉన్న‌ సుమారు 148 మంది సిబ్బందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.  ఇట‌లీలో రిజిస్ట‌ర్ అయిన‌ కోస్టా అట్లాంటికా నౌక‌.. నాగ‌సాకిలో జ‌న‌వ‌రి నుంచి డాకింగ్ అయి ఉన్న‌ది.  రిపేర్ కోసం ఆగిన ఆ షిప్‌లో సుమారు 623 మంది సిబ్బంది ఉన్నారు.  దాంట్లో ప్ర‌స్తుతానికి 148 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అయితే నెగ‌టివ్ తేలిన సిబ్బందిని మాత్రం వారివారి దేశాల‌కు పంపాల‌ని జ‌పాన్ యోచిస్తున్న‌ది. పాజిటివ్ తేలిన వ్య‌క్తులు ఎవ‌రూ సీరియ‌స్‌గా లేరని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  logo