శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 14, 2020 , 16:13:29

డిస్కవరీ చానల్‌ యాంకర్‌ గ్రాంట్ ఇమహారా కన్నుమూత

డిస్కవరీ చానల్‌ యాంకర్‌ గ్రాంట్ ఇమహారా కన్నుమూత

వాషింగ్టన్‌ డీసీ: డిస్కవరీ చానల్‌లో ప్రముఖ షో ‘మిత్‌బస్టర్స్‌’ యాంకర్‌ గ్రాంట్‌ ఇమహారా(49) మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని డిస్కవరీ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘గ్రాంట్ మరణం విచారకరం. అతడు మా డిస్కవరీ కుటుంబంలో ముఖ్యమైనవాడు. అతడు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.’ అని పేర్కొన్నారు.

కాగా, ఇమహారా ఆకస్మిక మృతికి కారణాలు తెలియలేదు. అతడు 'మిత్ బస్టర్స్' ప్రోగ్రాంకు యాంకరింగ్‌ చేశాడు. అలాగే, ప్రదర్శనలో ప్రయోగాల సమయంలో అవసరమైన రోబోలు,  ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేయడంలో అతడు ప్రసిద్ధి చెందాడు. అతడు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్  'వైట్ రాబిట్ ప్రాజెక్ట్'లో హోస్ట్‌గా చేరారు. 'డ్రంక్ హిస్టరీ’, 'షార్క్‌నాడో 3’, మార్వెల్ యానిమేటెడ్ సిరీస్ 'ఎవెంజర్స్ అస్సెంబుల్' లాంటి షోల్లో కూడా అతడు కనిపించాడు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo