e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News మనుషుల్ని చంపుకుతింటున్న బావి.. శతాబ్దాలుగా అంతుచిక్కని మిస్టరీ..

మనుషుల్ని చంపుకుతింటున్న బావి.. శతాబ్దాలుగా అంతుచిక్కని మిస్టరీ..

mystery well in yemen | అదో మృత్యు కుహరం. ఆ బావి దగ్గరకు వెళ్లిన వారెవ్వరూ ఇప్పటివరకూ తిరిగివచ్చిన దాఖలా లేదు. దాని దరిదాపుల్లోకి వెళ్లిన వందలాది పక్షులు, జంతువులు, మనుషుల జాడ గల్లంతైంది. ఆ భారీ బిలం గురించి ఆలోచిస్తేనే అశుభం కలుగుతుందని స్థానికులు చెప్పుకుంటారు. ‘నరక కూపం’గా పిలిచే ఆ బావి గుట్టు తెలుసుకుందామని తాజాగా కొందరు పరిశోధకులు అందులోకి దిగారు. తర్వాత ఏమైంది?

mystery well in yemen

ఏమిటీ ‘మిస్టరీ బావి’?

యెమెన్‌లో తూర్పున ఉన్న ఆల్‌-మహ్రా ప్రావిన్సులోని ఎడారి ప్రాంతంలో భూ ఉపరితలానికి 112 మీటర్ల లోతు, 30 మీటర్ల వెడల్పుతో ఈ బావి ఉంది. ఈ నుయ్యి గురించి కొన్ని శతాబ్దాలుగా ఏవేవో కథలు వినిపిస్తుండటం, దాని మిస్టరీని చేధించాలని యెమెన్‌ ప్రభుత్వం కూడా ప్రయత్నించకపోవడంతో ఒమన్‌లోని జర్మన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ఒమన్‌ కేవ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ టీమ్‌ (ఓసీఈటీ) బావిలోకి దిగాలని నిర్ణయించుకున్నది.

mystery well in yemen

బావిలో ఏమున్నది?

- Advertisement -

మిస్టరీ బావిలోకి దిగిన ఓసీఈటీ బృందానికి నుయ్యి అడుగు భాగంలో జంతు కళేబరాలు, మనుషుల ఎముకలు, పాములు, కొన్ని రాళ్లు (కేవ్‌ పెరల్స్‌) కనిపించాయి. అయితే, స్థానికులు చెప్పినట్టు అదృశ్య శక్తులు తమకేమీ తారసపడలేదని పరిశోధకులు పేర్కొన్నారు. బావి అడుగునుంచి నీరు, రాళ్లు, మట్టి, జంతు కళేబరాల నమూనాలు సేకరించిన పరిశోధకులు వాటిపై విశ్లేషణలు చేస్తామన్నారు. అయితే బావిలోకి దిగిన బృందంలో ఒకరైన సాలహ్‌ బబైర్‌ చెప్పిన విషయాలు కొంత ఆసక్తిని కలిగించాయి. ‘బావి అడుగు భాగానికి చేరుకోవడానికి తాళ్ల సాయంతో కిందకు దిగుతున్నాం. దాదాపు 50-60 మీటర్ల దిగువకు రాగానే.. ఏవేవో వింత సంఘటనలు, శబ్దాలను గమనించాం. అలాగే, ఏదో భిన్నమైన వాసన, పొగ రావడాన్ని గుర్తించాం. దానిపై లోతుగా పరిశోధించాల్సి ఉన్నది’ అని బబైర్‌ పేర్కొన్నారు. కాగా, ఆల్‌-మహ్రా జియోలాజికల్‌ సర్వే అండ్‌ మినరల్‌ రిసోర్సెస్‌ అథారిటీకి డైరెక్టర్‌ జనరల్‌గా బబైర్‌ పనిచేస్తుండటంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

mystery well in yemen

స్థానికంగా ఉన్న ప్రచారమేంటి?

దరిదాపుల్లోని ఖగోళ వస్తువులను కృష్ణబిలాలు ఎలాగైతే మింగేస్తాయో.. ఈ మృత్యుకుహరం కూడా పరిసరాల్లోకి వచ్చిన మనుషులు, జంతువులు, పక్షులను తినేస్తుందని వందల ఏండ్లుగా స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ బిలంలో కొన్ని అదృశ్య, ప్రేత శక్తులు ఉన్నట్టు ప్రచారమున్నది. స్థానికుల నమ్మకాలకు భంగం కలిగించొద్దనే ఆ బావి మిస్టరీపై దృష్టిసారించలేదని యెమెన్‌ ప్రభుత్వాధికారులు తెలిపారు. అయితే, బావిలోకి దిగిన బృందసభ్యులకు త్వరలోనే అశుభం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనను పరిశోధకులు కొట్టివేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

చీమ‌లు, చెద పురుగులతో ఐస్‌క్రీమ్‌లు, ప‌చ్చ‌ళ్లు.. మ‌రెన్నో వెరైటీలు.. తింటే ఎన్నో లాభాలు !!

అబ్ర‌హం లింక‌న్ గ‌డ్డం పెంచ‌డం వెనుక ఉన్న క‌థేంటో తెలుసా !

బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మ‌న శ్లోకాల కంటే పొడ‌వైనది

Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హ‌నీమూన్‌.. ఎక్కడో తెలుసా?

బాయ్‌ఫ్రెండ్ కోసం షాపింగ్ మాల్‌లో ముగ్గురు యువ‌తుల సిగ‌ప‌ట్లు!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement