మంగళవారం 26 జనవరి 2021
International - Nov 30, 2020 , 01:49:06

ఎలా వచ్చిందో.. అలాగే వెళ్లిపోయింది!

ఎలా వచ్చిందో.. అలాగే వెళ్లిపోయింది!

సాల్ట్‌లేక్‌ సిటీ: అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల క్రితం కనిపించిన లోహ స్తంభం (మోనోలిత్‌) తాజాగా అదృశ్యమైంది. ఉటా రాష్ర్టానికి చెందిన ఉటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీ అండ్‌ డివిజన్‌ ఆఫ్‌ వైల్డ్‌లైఫ్‌ రీసోర్సెస్‌ అధికారులు ఎర్రని రాళ్లతో నిండిన ఉటా ఎడారిలో నవంబర్‌ 18న ఓ లోహ స్తంభాన్ని గుర్తించారు. 10-12 అడుగుల ఎత్తు, మూడు వైపుల స్టీల్‌తో తయారైన ఆ స్తంభాన్ని అక్కడ ఎవరు పెట్టారో వాళ్లకు అర్థంకాలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి ఆ స్తంభం కనిపించడంలేదని ఉటాకు చెందిన బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ (బీఎల్‌ఎమ్‌) అధికారులు తెలిపారు. తాము తొలగించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు. కాగా, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎలియన్సే (గ్రహాంతరవాసులు) ప్రతిష్టించి, మళ్లీ తీసుకెళ్లారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


logo