బుధవారం 03 జూన్ 2020
International - Apr 21, 2020 , 19:07:31

భార‌తీయ వైద్యురాలికి అమెరికా సెల్యూట్‌..వీడియో

భార‌తీయ వైద్యురాలికి  అమెరికా సెల్యూట్‌..వీడియో

అమెరికాలోని సౌత్ విండ్సర్ హాస్పిటల్‌లో కరోనావైరస్ రోగులకు చికిత్స చేసినందుకు మైసూర్‌కు చెందిన డాక్టర్ ఉమా మధుసూద‌న్‌కు అమెరికా ప్ర‌భుత్వం అభినంద‌న‌లు తెలిపింది. క‌రోనా బాధితుల‌కు ఉమా చేస్తున్న సేవ‌ల‌కు గాను అధికారులు త‌న ఇంటి ముందు నుంచి ప్ర‌భుత్వ వాహ‌నాల‌తో ప‌రేడ్ నిర్వ‌హించారు. ఇరుగుపొరుగు వారు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆమె సేవ‌ల‌కు సెల్యూట్ చేశారు. అమెరికాలో ప‌నిచేస్తున్న ఇండియా డాక్ట‌ర్ల‌లో క‌రోనాకు కొంత‌మంది బ‌లైపోయిన‌ప్ప‌టికి ఉమ‌లాంటి వైద్యురాలు ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా రోగుల‌కు సేవ‌లందిస్తున్నారు. క‌నీసం 100 వాహ‌నాలు కాన్వాయ్ డాక్ట‌ర్ ఉమా ఇంటి ముందు కొన్ని సెకండ్ల‌పాటు ఆపి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నుంచి ఆమె సెల్యూట్ అందుకున్న‌ది. దీంతో యావ‌త్ బార‌త్ గ‌ర్వ‌ప‌డింది.logo