ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Jul 18, 2020 , 08:42:29

విజృంభిస్తున్న డెంగ్యూ.. అప్రమత్తమైన ప్రభుత్వం

విజృంభిస్తున్న డెంగ్యూ.. అప్రమత్తమైన ప్రభుత్వం

హనోయ్‌: కరోనాతో వణికిపోతున్న మయన్మార్‌కు మరో ముప్పువచ్చిపడింది. తాజాగా దేశంలో కరోనాకు డెంగ్యూ తోడయ్యింది. దేశంలో డెంగ్యూ 20 మంది మరణించగా, 2862 కేసులు వచ్చాయి. దీంతో డెంగ్యూపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య, క్రీడా మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీచేసింది. 

మయన్మార్‌లోని 20 పట్టణాల్లో డెంగ్యూ జ్వరాలతో 12 మంది మరణించారు. దోమల వ్యాప్తి పెరగడం వల్ల వైరల్‌ జ్వరాలు అధికమవుతుండటంతో ప్రజలను సర్కారు అప్రమత్తం చేసింది. డెంగ్యూ జరాలు పెరగకుండా దోమల నివారణకు చర్యలు చేపట్టింది. దేశంలో గతేడాది 24,345 మంది డెంగ్యూ బారినపడగా, వంద మంది మృతిచెందారు. డెంగ్యూ జ్వరం ఈడెస్‌ దోమ కాటు ద్వారా సంక్రమిస్తుంది. ఇది ఎక్కువగా వానా కాలంలో డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.


logo