బుధవారం 03 జూన్ 2020
International - May 07, 2020 , 08:41:51

ఇరాక్ నూత‌న ప్ర‌ధానిగా ముస్త‌ఫా క‌దిమి

ఇరాక్ నూత‌న ప్ర‌ధానిగా ముస్త‌ఫా క‌దిమి

న్యూఢిల్లీ: ఇరాక్ నూత‌న ప్ర‌ధానిగా ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ముస్త‌ఫా క‌దిమి ఎంపిక‌య్యారు. గురువారం ఇరాక్ పార్ల‌మెంటులో జ‌రిగిన ఓటింగ్ ద్వారా ఆయ‌నను ప్ర‌ధానిగా ఎంచుకున్నారు. కాగా, అమెరికా మ‌ద్ద‌తున్న ముస్త‌ఫా క‌దిమికి ఎలాంటి వ్య‌వాహార‌న్నైనా అవ‌లీలగా చ‌క్క‌బెట్ట‌గ‌ల‌డ‌నే పేరుంది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఆందోళ‌న‌లు వెల్లువెత్త‌డంతో  అప్ప‌టి ప్ర‌ధాని అదెల్ అబ్దుల్ మెహ‌దీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌ధానిగా కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ముస్త‌ఫా క‌దిమిని పూర్తి స్థాయి ప్ర‌ధానిగా ఎంచుకున్నారు. 

ఇరాక్ పార్ల‌మెంటులో ఓటింగ్ పూర్తి కాగానే ట్విట్ట‌ర్లో స్పందించిన నూత‌న ప్ర‌ధాని దేశ‌ భ‌ద్రత‌, స్థిర‌త్వం, వికాసం కోసం తాను శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు. అయితే, ప్ర‌స్తుత నెల‌కొని ఉన్న‌ ప‌రిస్థితుల్లో దేశంలో మాటు వేసి ఉన్న క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డానికే ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇస్తాన‌ని ఆయ‌న తెలిపారు. కాగా, ఇరాక్ నూత‌న ప్ర‌ధాని క‌దిమికి అమెరికాతో బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయ‌ని న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక పేర్కొన్న‌ది.  

  


logo