బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 05, 2020 , 15:09:41

చిరుతనే ప్రతిఘటించిన ఉడుము..వీడియో

చిరుతనే ప్రతిఘటించిన ఉడుము..వీడియో

సాధారణంగా జంతువులు తమ మనుగడ సాధించేందుకు మరికొన్ని జీవులను చంపుతాయనే విషయం తెలిసిందే. ఆకలితో ఉన్న  క్రూరమృగాలైతే ఎంతటి జంతువునైనా వేటాడి చంపి ఆకలి తీర్చుకుంటాయి. అయితే జాంబియాలో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది.  కానీ చిరుత, ఉడుం (వాటర్‌ మానిటర్‌)కు మధ్య ఈ పోటీ జరిగింది. కైంగు సఫారీ లాడ్జ్‌ పార్కులో ఓ చిరుత పొదల్లో నుంచి రోడ్డువైపుగా వచ్చింది. అటువైపు నుంచి వస్తోన్న ఉడుంను చూసి దాని దగ్గరకు వెళ్లింది. ఇది గమనించిన ఉడుం ఏ మాత్రం భయపడకుండా తన తోకతో చిరుతను దగ్గరకి రానీయకుండా బలంగా ప్రతిఘటించింది. చిరుత మాత్రం కొద్దిసేపు ఆగి నెమ్మదిగా ఆ ఉడుంను నోట కరుచుకుని పొదల్లోకి వెళ్లిపోయింది. 2018లో జరిగిన ఈ వీడియోను తాజాగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాశ్వాన్‌ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసుకున్నారు. ఈ వీడియో ఇపుడు తెగ వైరల్‌ అవుతున్నది. logo