శనివారం 30 మే 2020
International - May 12, 2020 , 10:29:51

ముందు నేనే అరెస్టు అవుతా: టెస్లా చీఫ్‌

ముందు నేనే అరెస్టు అవుతా:  టెస్లా చీఫ్‌


హైద‌రాబాద్‌: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సికో న‌గరంలో ఉన్న ఎల‌క్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా త‌న ఉత్ప‌త్తుల‌ను ప్రారంభించ‌నున్న‌ది. కంపెనీలు తెర‌వ‌రాదంటూ ఆదేశాలు ఉన్నా.. టెస్లా చీఫ్ ఎల‌న్ మ‌స్క్ మాత్రం ఆ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఫ్యాక్ట‌రీల‌ను ఇప్పుడు ఓపెన్ చేయ‌వ‌ద్దు అంటూ కాలిఫోర్నియాలోని అల‌మేడా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ.. టెస్లా కంపెనీలో ఉత్ప‌త్తి ప్రారంభిస్తున్న‌ట్లు ఎల‌న్ మ‌స్ తాజాగా ట్వీట్ చేశారు. ఒక‌వేళ అధికారులు ఎవ‌రినైనా అరెస్టు చేస్తే, ముందు వ‌రుస‌లో తానే ఉంటాన‌ని ఎల‌న్ మ‌స్క్ తెలిపారు. ప్లాంట్‌ను తెరిచేందుకు రాష్ట్ర అధికారులు అనుమ‌తి ఇచ్చినా.. జిల్లా అధికారులు మాత్రం నిరాక‌రిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  లాక్‌డౌన్ ఇలాగే ఉంటే త‌న హెడ్ ఆఫీసును మ‌రో చోటుకి త‌ర‌లిస్తాన‌ని గ‌త వారం కూడా ఓ వార్నింగ్ ఇచ్చారు.logo