ఆదివారం 31 మే 2020
International - Apr 17, 2020 , 21:10:24

ఈ స‌మ‌యంలోనే వారిని సంతోష‌పెట్టాలి!

ఈ స‌మ‌యంలోనే వారిని సంతోష‌పెట్టాలి!

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినాశ‌నం క‌లిగిస్తున్న‌ది. కొవిడ్‌-19 బాధితులు, వైద్యులు, పోలీసులు క‌రోనాపై యుద్ధం చేస్తున్నారు. కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు.. తమకెక్కడ వైర‌స్ సోకుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి బాధ‌ల్లో ఉన్న‌ప్పుడే వారికి మ‌నోధైర్యం క‌ల్పించాలి అంటున్నారు క‌ళాకారులు. బీరుట్ ప్రభుత్వేతర సంస్థ అయిన అహ్లా ఫౌడా నుంచి వచ్చిన సంగీతకారులు ఒక క్రేన్‌ను వేదిక‌గా చేసుకున్నారు. వారు ర‌ఫిక్ హ‌రిరి హాస్పిట‌ల్‌లో ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. లెబ‌నాన్‌లోని బీరుట్‌లో రోగులు, హాస్పిట‌ల్ సిబ్బందికి ఉత్సాహాన్ని నింపేందుకే ఈ ప్ర‌ద‌ర్శ‌న చేశారు సంగీతకారుల బృందం. వీరు పాట‌ల‌తో సంద‌డి చేస్తుంటే చుట్టూ ప్ర‌జ‌లు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

ఈ వీడియోను హుస్సేన్ మ‌ల్లా ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. లెబ‌నాన్‌లో కరోనావైరస్ కేసులు 600 కి పైగా నమోదయ్యాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా ప్రజలు కోవిడ్ -19 బారిన పడ్డారు. భారతదేశంలో మాత్రమే ఏప్రిల్ 17 నాటికి 13,000 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.


logo