శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 14, 2020 , 03:03:32

ముషారఫ్‌కు ఉరి తప్పింది!

ముషారఫ్‌కు ఉరి తప్పింది!
  • ప్రత్యేక కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను లాహోర్‌ హైకోర్టు రద్దు చేసింది. ఆయనపై దాఖలైన దేశద్రోహం కేసులో.. నమోదైన ఫిర్యాదు, కేసు విచారణ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం 2013లో ముషారఫ్‌పై దేశద్రోహం కేసు పెట్టింది. దాదాపు ఆరేండ్ల విచారణ అనంతరం ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక కోర్టు గత నెల 17న ఆయనకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ముషారఫ్‌ తరఫు న్యాయవాది లాహోర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడమే రాజ్యాంగ విరుద్ధమని ముగ్గురు సభ్యుల హైకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా ప్రకటించింది. చట్టం ప్రకారం ముషారఫ్‌కు వ్యతిరేకంగా దేశద్రోహం కేసు నమోదు చేయలేదని, ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు స్వేచ్ఛా జీవి అని ముషరఫ్‌ తరుఫు న్యాయవాది ఇష్తియాఖ్‌ ఖాన్‌ చెప్పారు.


logo