శాన్ఫ్రాన్సిస్కో, మే 5: అమెరికాలో ఆసియన్ అమెరికన్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శాన్ఫ్రాన్సిస్కోలో ఇద్దరు ఆసియా అమెరికన్ వృద్ధురాళ్లపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాళ్ల ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం తెలియరాలేదు. ఇది విద్వేష దాడా లేక వారిద్దరు లక్ష్యంగా జరిగిన దాడా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.