సోమవారం 25 జనవరి 2021
International - Jan 03, 2021 , 02:54:52

లష్కరే ఉగ్రవాది లఖ్వీ అరెస్టు

లష్కరే ఉగ్రవాది లఖ్వీ అరెస్టు

లాహోర్‌, జనవరి 2: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్‌ అధిపతి జకీ ఉర్‌ రెహమాన్‌ లఖ్వీని పాకిస్థాన్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడన్న అభియోగాలతో లఖ్వీని పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక పోలీస్‌ విభాగం (సీటీడీ) శనివారం అరెస్టు చేసినట్టు పాక్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన లఖ్వీని గతంలోనే పాక్‌ అధికారులు అరెస్టు చేశారు. పలు ఉగ్రదాడుల కేసుల్లో అరస్టైన అతడు 2015లో బెయిలుపై జైలు నుంచి బయటకొచ్చాడు. 


logo