శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 12, 2020 , 15:33:18

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ

ఇస్లామాబాద్‌: తీవ్రవాద సంస్థలైన జమాత్‌ ఉద్‌ దావా, లష్కర్‌ ఏ తోయిబాకు చెందిన ఐదుగురు నాయకుల బ్యాంకు ఖాతాలను పాకిస్తాన్‌ సర్కారు పునరుద్ధరించింది. ఇందులో వాటి చీఫ్‌, ముంబై దాడుల సూత్రదారి అయిన హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్‌ బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) ఆంక్షల కమిటీ నుంచి అధికారికంగా ఆమోదం పొందిన  తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సర్కారు వెల్లడించింది.  

హఫీద్‌ సయీద్‌తోపాటు అబ్దుల్‌ సలాం భుట్టవి, హాజీ ఎం అష్రాఫ్, యాహ్యా ముజాహిద్, జాఫర్ ఇక్బాల్ ఖాతాలను పునరుద్ధరించినట్లు పాకిస్తాన్‌ సర్కారు ప్రకటించింది. వీరంతా యూఎన్‌సీసీ ఎన్‌లిస్టెడ్‌ త్రీవావాదులని పేర్కొంది.  ప్రస్తుతం వారంతా పంజాబ్ కౌంటర్-టెర్రరిజం డిపార్ట్‌మెంట్  (సీటీడీ) వారిపై దాఖలు చేసిన టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో లాహోర్ జైలులో 1 నుండి 5 ఏళ్ల వరకు శిక్షలు అనుభవిస్తున్నారు. తమ కుటుంబ వ్యవహారాలను నిర్వహించేందుకు వీలుగా తమ బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితికి వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. ‘మొదట్లో మేము అప్పీల్ దాఖలు చేయకూడదనుకున్నాం, కానీ వారు వారి వ్యవహారాలను నడపడం చాలా కష్టం కాబట్టి అప్పీల్‌ దాఖలు చేయాలని మాకు విజ్ఞప్తులు అందాయి. దీంతో అధికారులను సంప్రదించాం. చట్టబద్ధంగా, ఐక్యరాజ్యసమితి ఆమోదంతో ఖాతాలను పునరుద్ధరించారు.’ అని ఆ సంస్థ  ముఖ్య నాయకుడు ఒకరు పేర్కొన్నారు. కాగా, ఈ నాయకులు పాకిస్తాన్ ప్రభుత్వానికి వారు చేసిన అభ్యర్థనలో వారి ఆర్థిక ఆదాయం, ఆదాయ వనరుల గురించి కూడా పేర్కొన్నారు. వీటితోపాటు వారి బ్యాంక్ ఖాతా నంబర్లు, ఇతర సంబంధిత వివరాలను యూఎన్‌ఎస్‌సీకి పంపినట్లు పాక్‌ సర్కారు వెల్లడించింది.  లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo