శనివారం 30 మే 2020
International - Apr 16, 2020 , 09:07:32

లాక్‌డౌన్‌లో అత్య‌ధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌...

లాక్‌డౌన్‌లో అత్య‌ధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌...

ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మ‌హమ్మారి వ‌ణికిస్తోంది. అయితే ఈ వైరస్ కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది. ఈ వైర‌స్ నియంత్ర‌ణ‌కు చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి ప్రజలు ఎవరు బయటికి రాకూడదని ఆంక్షలు విధించాయి. దీంతో ప్రజలంద‌రూ ఇండ్లకే పరిమితం అయ్యారు. ఈ నేప‌థ్యంలో జ‌నం త‌మ ఫోన్లకు అంకితం అయ్యారు. ఇక లాక్ డౌన్ లో యాప్స్ అత్యధికంగా డౌన్లోడ్ చేస్తున్నారు. అందులో గేమ్స్, సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ అధికంగా డౌన్‌లోడ్ చేశారు. ప‌లు దేశాల్లో చూస్తే.. అమెరికాలో సగటున ఒక వారానికి 30 కోట్ల యాప్స్,  చైనా లో 18 కోట్ల యాప్స్ చేస్తే, ఇండియాలో మాత్రం ఏకంగా 38 కోట్ల యాప్స్ డౌన్లోడ్ చేశారు. అందులో అధికంగా  టిక్ టాక్, వాట్సాప్, ఫేస్ బుక్, షెరిట్, హలో యాప్స్ ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక గేమ్స్‌కి సంబంధించిన‌ యాప్స్ లో పబ్జి, క్యాండీ క్రష్, లూడో, క్యారమ్ పుల్, హంటర్ అసాసిన్ అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్నారు.


logo