ఆదివారం 31 మే 2020
International - May 03, 2020 , 15:56:28

ఇరాన్‌లో తెరుచుకోనున్న మ‌సీదులు..

ఇరాన్‌లో తెరుచుకోనున్న మ‌సీదులు..


హైద‌రాబాద్‌: ఇరాన్‌లో మ‌సీదుల‌ను తెర‌వ‌నున్నారు.  రంజాన్ మాసం కావ‌డంతో.. క‌రోనా వైర‌స్ కేసులు త‌క్కువ ఉన్న ప్రాంతాల్లో మ‌సీదులు తెరిచేందుకు అధ్య‌క్షుడు హ‌స‌న్ రౌహ‌నీ అంగీకారం తెలిపారు. సోమ‌వారం నుంచి మ‌సీదులు తెరుచుకోనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 132 లో-రిస్క్ ప‌ట్ట‌ణాల్లో.. మ‌సీదులు ప్రార్థ‌న‌ల‌కు అందుబాటులో ఉంటాయ‌న్నారు. అయితే హెల్త్ ప్రోటోకాల్ క‌చ్చితంగా పాటించాల‌న్నారు.  ఇరాన్‌కు చెందిన ఆరోగ్య‌శాఖ దేశాన్ని మొత్తం మూడు జోన్లుగా విభ‌జించింది.  ఇన్‌ఫెక్ష‌న్లు, మ‌ర‌ణాల ఆధారంగా ఎల్లో, గ్రీన్‌, వైట్ జోన్లుగా వేరు చేసింది. ఇరాన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల సుమారు 6500 మంది చ‌నిపోయారు. మ‌రో ల‌క్ష మందికి వైర‌స్ సంక్ర‌మించింది.

 logo