శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 15, 2020 , 17:46:47

రష్యాలో 24వేలు దాటిన కరోనా కేసులు

రష్యాలో 24వేలు దాటిన కరోనా కేసులు

మాస్కో: అమెరికాలో వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతుండగా రష్యాలో మాత్రం విజృంభిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రష్యాపై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది.  రష్యాలో కొత్తగా 3,388 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 24,490కు చేరింది. ఇప్పటి వరకు 198 మంది కరోనా బారిన పడి చనిపోయారు.   దేశ రాజధాని మాస్కో నగరంలోనే 14,776 కేసులున్నాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఆదేశంలో 198 మంది చనిపోయారు. logo