శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 24, 2020 , 01:01:04

స్వస్థలాలకు కేరళవాసుల మృతదేహాలు

స్వస్థలాలకు కేరళవాసుల మృతదేహాలు

కాఠ్మాండు: నేపాల్‌లో మృతిచెందిన ఎనిమిది మంది కేరళ పర్యాటకుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం, ఇతర లాంఛనాలు పూర్తయ్యాక కాఠ్మాండు నుంచి 2 ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను ఢిల్లీకి తరలించినట్లు భారత రాయబార అధికారులు తెలిపారు. అక్కడి నుంచి కేరళలోని వారి స్వస్థలాలకు తరలించినట్లు చెప్పారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని ఒక అధికారి అన్నారు. కేరళ నుంచి 15 మంది పర్యాటకులు నేపాల్‌కు వెళ్లగా వారిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.logo