సోమవారం 30 మార్చి 2020
International - Mar 11, 2020 , 11:48:13

ఇటలీలో 8,500కు పైగా కరోనా కేసులు..

ఇటలీలో 8,500కు పైగా కరోనా కేసులు..

రోమ్‌: ఇటలీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 8,514 చేరగా, మృతుల సంఖ్య 631 చేరింది. సివిల్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఏంజెలో బరేలీ ఈ వివరాలను వెల్లడించారు. కరోనా వైరస్‌ ఎమర్జన్సీ కారణంగా ఆమెకు ఇటలీ ప్రభుత్వం జాతీయ కమిషనర్‌ బాధ్యతలు అప్పగించింది. వ్యాధి గురైన వారిలో కొద్ది మంది 50-59 సంవత్సరాల లోపు ఉండగా, 8 శాతం మంది 60-69, 32 శాతం మంది 70-79, 45 శాతం 80-89, 14 శాతం 90 ఏళ్ల పై బడినవారు ఉన్నట్లు ఆమె వివరించారు.  కరోనా కారణంగా.. ఇటలీ ప్రభుత్వం అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రజలు గుమిగూడే ప్రాంతాలు.. సినిమా థియేటర్లు, నైట్‌ క్లబ్స్‌ సైతం మూసివేశారు. ప్రజలు ఎలాంటి కార్యక్రమాలున్నా రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

కాగా, ప్రపంచవ్యాప్తంగా.. 4 వేల మందికి పైగా కరోనా కారణంగా మరణించగా, లక్షా 13 వేల మంది వ్యాధి బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వివరాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్‌ ఓ) ప్రకటించింది. కాగా, 64 వేల మంది వ్యాధి నుంచి ఉపశమనం పొందినట్లు డబ్ల్యూ హెచ్‌ ఓ తెలిపింది. ఎయిర్‌ కెనడా మే 1 వరకు ఇటలీకి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. హంగేరికి చెందిన విజ్‌ ఎయిర్‌ విమాన సంస్థ కూడా ఇటలీకి వెళ్లే విమాన సర్వీసులను రెండు  వారాల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 


logo