మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 21:19:44

ఇండోనేషియాలో కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ గుర్తింపు!

ఇండోనేషియాలో కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ గుర్తింపు!

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్‌ మ్యుటేషన్‌పై శాస్త్రవేత్తలకు ఇంకా సంపూర్ణ అవగాహన రాలేదు. అసలు ఈ వైరస్‌ ఉత్పరివర్తనం (మ్యుటేషన్‌) ఉందా? ఉంటే ఇది వ్యాక్సిన్‌పై ఎలా ప్రభావం చూపుతుంది? అనేదానిపై పరిశోధనలు సాగుతున్నాయి. కాగా, ఇండోనేషియాలో తాజాగా కరోనా వైరస్‌ కొత్త జాతిని గుర్తించారు. ఇంతకుముందు మలేషియాలో వెలుగుచూసిన డీ614జీ జాతి వైరస్‌ ఇండోనేషియన్లలో కనిపించింది. ఇది వైరస్‌ వ్యాప్తిని పదిరెట్లు పెంచుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మ్యుటేషన్‌పై మళ్లీ చర్చ మొదలైంది. 

జకార్తాకు చెందిన ఐజ్క్మాన్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ మాలిక్యులర్ బయాలజీ ఈ కొత్త జన్యువును గుర్తించింది. 22 మందిలో ఎనిమిది మందికి ఈ వైరస్‌ జాతి ఉన్నట్లు తేల్చారు. అంటే ఇండోనేషియాలో దాదాపు ఈ మ్యుటేషన్‌ 40 శాతం ఉంటుందని అంచనావేశారు.  మరిన్ని నమూనాలను పరిశీలిస్తే ఇంకా స్పష్టత వస్తుందని ఆ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్ అమిన్ సోబాండ్రియో పేర్కొన్నారు. మ్యుటేషన్‌ లక్షణాలను అర్థంచేసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియను నిర్వహిస్తాం అని స్పష్టం చేశారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo