మంగళవారం 26 మే 2020
International - May 08, 2020 , 10:44:53

ర‌ష్యాలో క‌రోనా క‌రాళ‌నృత్యం

ర‌ష్యాలో క‌రోనా క‌రాళ‌నృత్యం

మాస్కో: రష్యాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రష్యా ఇప్పుడు కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతోంది.  గత వారం పదిరోజులుగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ప్రధానమంత్రితో స‌హా..ఒక‌రిద్ద‌రు మంత్రులు కూడా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా వైరస్ నియంత్రణకు అన్ని దేశాల కంటే ముందే తేరుకున్నప్పటికీ లాక్‌డౌన్ విషయంలో ఆలస్యం చేయడమే ఇప్పుడు కేసులు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. రోజురోజుకు వేలసంఖ్య‌లో‌ పెరుగుతున్న కేసులతో రష్యా ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో జర్మనీ, ఫ్రాన్స్‌లను కూడా దాటేసింది. దేశ్యాప్తంగా ఇప్పటి వరకు 1,77,160 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో సగానికి పైగా కేసులు ఒక్క రాజధాని మాస్కోలోనే నమోదయ్యాయి. 1,625 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భయపడుతున్న ప్రజలు మాస్కోను వీడుతున్నారు. 


logo