గురువారం 04 జూన్ 2020
International - May 07, 2020 , 21:58:41

పాక్‌లో విజృంభిస్తున్న క‌రోనా

పాక్‌లో విజృంభిస్తున్న క‌రోనా

ఇస్లామాబాద్: ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి దాయాది దేశం పాకిస్తాన్‌లో విజృంభిస్తోంది. రోజురోజుకి అక్క‌డ క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో పెరుగుతున్నాయి.. గడిచిన 24 నాలుగు గంటల్లో కొత్తగా మరో 1,523 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఈ మేర‌కు పాకిస్థాన్‌ అధికారులు ప్రకటించారు. ఇవాళ‌ నమోదైన కేసులతో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 24 వేలకు దాటింది. ఇక గత 24 గంటల్లో కరోనా బారినపడి మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 564కు చేరింది. అయితే పాక్‌లో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా సింధ్ ప్రావిన్స్‌తో పాటు.. పంజాబ్‌, ఖైబర్‌ ప్రావిన్స్‌, బలుచిస్తాన్‌ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.


logo